ప్రస్తుత రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ‘’ఉద్యమ సింహం’’ ఫస్ట్ లుక్ పోస్టర్. ‘’కె.సి.ఆర్ బయోపిక్’’..

అసలే తెలంగాణాలో రాజకీయ వాతావరణం బాగా వేడి మీద ఉంది, శాసనసభను రద్దు చేసి మరీ ముందే ఎలక్షన్ లకు తెరతీసిన టి.ఆర్.ఏస్ పార్టి ఇటు మహాకూటమి ఇరు పక్షాలు ప్రచారం జోరుగా చేసుకుంటున్న తరుణంలో, ఈ సారి తెలంగాణాలో అధికారం చేపట్టబోయేది ఏ పార్టి అని ఇప్పుడు వేడి వేడి చర్చ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఒక సినిమా పోస్టర్ ఆ వేడి నీ మరింత పెంచేసింది. ఆ సినిమానే కె.సి.ఆర్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఉద్యమసింహం.

అసలు వివరాల్లోకి వెళితే, పద్మనాయక ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో అల్లూరి కృష్ణం రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంగీతం దిలీప్ బండారి, కెమెరా ఉదయ కుమార్, మాటలు కృష్ణ రాపోలు, ఏడిటింగ్ నందమూరి హరి, లిరిక్స్ పి.యెచ్ రాములు, యాక్షన్ సూపర్ ఆనంద్, కోరియోగ్రఫీ గణేష్ మాస్టర్, సహా నిర్మాత - మేకా రాఘవేంద్ర, కథ – నిర్మాణం కె. నాగేశ్వర్ రావు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన ఈ చిత్రం ఈ నేల లోనే భారీగా విడుదల కానుంది, మరి విడదల అయిన తరువాత ఈ చిత్రంతో ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో విడుదల వరకూ వేచి చేసి చూడాలి.

ఏది ఏమైనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి.

.